కేరళలో దారుణం, ‘అల్లా’కు తన ఆరేళ్ళ కొడుకును బలి ఇచ్చిన తల్లి, అరెస్టు చేసిన పోలీసులు

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ముస్లిం మహిళ తన ఆరేళ్ళ కొడుకును గొంతు కోసి హత్య చేసింది. అల్లాను తృప్తి పరచేందుకు అతడిని బలి ఇచ్చానని అంటోంది.

కేరళలో దారుణం, అల్లాకు తన ఆరేళ్ళ కొడుకును బలి ఇచ్చిన తల్లి, అరెస్టు చేసిన పోలీసులు

Edited By:

Updated on: Feb 08, 2021 | 3:44 PM

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ముస్లిం మహిళ తన ఆరేళ్ళ కొడుకును గొంతు కోసి హత్య చేసింది. అల్లాను తృప్తి పరచేందుకు అతడిని బలి ఇచ్చానని అంటోంది. ఈ నెల 7 న తెల్లవారు జామున 3-4 గంటల మధ్య తమకు ఈ మహిళ నుంచి ఫోన్ కాల్ అందిందని, ఆమె చెప్పిన చోటుకు వెళ్లగా తన ఇంటి గేటు వద్ద ఆమె వేచి ఉందని పోలీసులు తెలిపారు. ఈమెను షాహిందా అనే మహిళగా గుర్తించారు. ఈమె ఇంటి బాత్ రూమ్ లో ఈమె చిన్నారి కొడుకు విగత జీవిగా కనబడ్డాడు. ఈమె భర్త, ఇద్దరు పిల్లలు పక్క గదిలోనే నిద్రిస్తున్నా వారికి ఈ ఘోరం గురించి తెలియలేదట.

తన నాలుగో బిడ్డ గర్భంతో ఉన్న షాహిందా ఓ మదరసాలో టీచర్ గా పని చేస్తోందట. పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. తన చేతికి కూడా ఈమె గాయం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఈ ఘోరంపై కేసు నమోదు చేసుకుని  వారు దర్యాప్తు ప్రారంభించారు.

Read More:నో డౌట్, యుఎస్ ఎలెక్షన్ లో ఫ్రాడ్ జరగలేదు, అటార్నీ జనరల్, మారని ట్రంప్ ట్రెండ్ !

Read More:మైనర్‌తో లైంగిక సంబంధం.. ఒలింపిక్ విజేతపై కేసు నమోదు.. దోషిగా తేలితే..!

Loading...
Unable to load recommendations.
Follow Us