కేరళలో భారీగా గంజాయి పట్టుబడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తుండగా 100 కిలోల గంజాయి పట్టుబడింది. వయనాడ్‌లోని తోల్‌పెట్టి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ డీసీఎం అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో అందులో వంద కిలలో గంజాయి కన్పించింది. మొత్తం నాలుగు సంచుల్లో గంజాయిని సీజ్ చేశారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని కూడా సీజ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Kerala: Officials of Excise Department seized ganja (cannabis) weighing 100 kg from a vehicle at Tholpetty check post in Wayanad, today. Two persons have been arrested. pic.twitter.com/rS0lWN3hth
— ANI (@ANI) August 15, 2020
Read More :
16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా