Dr. Suicide: ఓ హోటల్‌లో సూసైడ్‌కు పాల్పడ్డ డాక్టర్ చంద్రశేఖర్‌.. కటిక శ్రీను మర్డర్‌ కేసులో మరో సంచలనం.!

|

Sep 12, 2021 | 7:45 PM

రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కటిక శ్రీను మర్డర్‌ కేసులో మరో సంచలనం తెరమీదకొచ్చింది. శ్రీను హత్యకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు

Dr. Suicide: ఓ హోటల్‌లో సూసైడ్‌కు పాల్పడ్డ డాక్టర్ చంద్రశేఖర్‌.. కటిక శ్రీను మర్డర్‌ కేసులో మరో సంచలనం.!
Dr
Follow us on

Katika Srinu Murder Case: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన కటిక శ్రీను మర్డర్‌ కేసులో మరో సంచలనం తెరమీదకొచ్చింది. శ్రీను హత్యకు కుట్ర పన్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూసైడ్‌కు పాల్పడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇవాళ హైదరాబాద్‌ KPHB కాలనీలోని ఓ హోటల్‌లో బలవన్మరణానికి పాల్పడ్డారు చంద్రశేఖర్‌. మెదక్‌లో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు చంద్రశేఖర్‌. నిజాంపేటలో కుమారుడిని నీట్ పరీక్ష రాయించేందుకు భార్యతో సహా హైదరాబాద్‌ వచ్చిన చంద్రశేఖర్ సితారా గ్రాండ్‌ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యను ఇంటికి పంపించి సూసైడ్‌ చేసుకున్నారు.

ఇటీవల కటిక శ్రీను మర్డర్‌ కేసులో డాక్టర్‌ చంద్రశేఖర్‌పై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. కటిక శ్రీనును చంపించింది చంద్రశేఖరేనంటూ ప్రచారం సాగింది. ఇరువురి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలే కటిక శ్రీను మర్డర్‌కు దారితీశాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. చంద్రశేఖర్‌ను కఠినంగా శిక్షించాలంటూ స్థానికంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రశేఖర్‌ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. కటిక శ్రీను మర్డర్‌ కేసే డాక్టర్‌ సూసైడ్‌కు కారణమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారు దగ్ధం కేసులో ఎక్కడ తన పాత్ర బయటపడుతుందోనన్న భయంతోనే చంద్రశేఖర్‌ సూసైడ్‌ చేసుకున్నారంటూ ప్రచారం నడుస్తోంది.

Read also: Ganesh Immersion: ఒకవైపు హైకోర్టు.. మరోవైపు భక్తులు. ఇద్దరి మధ్యా నలిగిపోతోన్న టీ సర్కారు