Kadapa mining blast case: కడప జిల్లాలో ఇటీవల జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో వైఎస్ఆర్ సీపీ నేత సి.నాగేశ్వరరెడ్డి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రఘునాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కడప ఎస్సీఅన్బురాజన్ సోమావారం వెల్లడించారు. కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని ముగ్గురాయి గనుల్లో ఈ నెల 8న జరిగిన పేలుళ్లలో 10 మంది కూలీలు దుర్మరణం చెందారు.
2013లో జీపీఏ తీసుకుని నాగేశ్వరరెడ్డి ఈ గనిని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ఇక్కడ పేలుళ్లు జరపకూడదని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. గని వాస్తవ లీజుదారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఎస్పీ తెలిపారు. పేలుడు పదార్థాలు సరఫరా చేసేందుకు రఘునాథరెడ్డికి లైసెన్స్ ఉందని, అయితే వాటి రవాణా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఆయన్ను కూడా విచారిస్తున్నట్టు చెప్పారు.
ప్రమాదానికి కారణమైన 1000జిలెటిన్ స్టిక్స్, 120 డిటోనేటర్లను పులివెందులలో తీసుకున్నారని.. వాటిని కారులో తరలించి దింపుతుండగా పేలుళ్లు సంభవించాయన్నారు. ఈ గనికి సంబందించి పలు విషయాలపై స్పష్టత కోసం అధికారులకు లేఖలు రాశామని.. వివరణ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
Also Read: