కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో సిరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కాగా, ఈ ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు విశాఖ, ఒడిశాకు చెందిన వారుగా గుర్తించారు.
సోమాజిగూడలో రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన జీపు బోల్తా.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం