హెచ్‌1బీ వీసా కుంభకోణం: అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌

అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా విదేశీయులకు కల్పించే హెచ్‌ 1బీ వీసాల విషయంలో ఓ భారతీయుడు కుంభకోణానికి పాల్పడ్డాడు

హెచ్‌1బీ వీసా కుంభకోణం: అమెరికాలో భారతీయుడి అరెస్ట్‌

Updated on: Aug 22, 2020 | 5:45 PM

H1-B Visa Fraud Case: అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా విదేశీయులకు కల్పించే హెచ్‌ 1బీ వీసాల విషయంలో ఓ భారతీయుడు కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇందులో అతడు దాదాపుగా 21 మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కి చెందిన అశిస్ సాహ్నీ(48) అనే వ్యక్తి హెచ్‌ 1 స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ వీసాల్లో మోసాలకు తెరలేపాడు. 2011-16 మధ్యకాలంలో ఇతడు దాదాపుగా 21మిలియన్‌ డాలర్లను ఆర్జించాడు. అంతేకాదు తప్పుడు స్టేట్‌మెంట్‌లతో కూడిన దరఖాస్తులు సమర్పించి, శాశ్వతంగా అమెరికా పౌరుడిగా ఉండేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక అధికారుల దర్యాప్తులో అతడి మోసాలు భయటకు రావడంతో అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఒకవేశ అశిస్‌ నేరం రుజువైతే అతడికి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Read More:

మెగాస్టార్‌ బర్త్‌డే.. మెగా ఫ్యాన్స్‌కి సుస్మిత స్పెషల్ గిఫ్ట్‌

సుశాంత్ కేసు: కీలక విషయం బయటపెట్టిన లాక్‌స్మిత్‌‌

Loading...
Unable to load recommendations.
Follow Us