it raids on real estate offices: రియల్ ఎస్టేట్ దందా ముసుగులో బ్లాక్‌మనీ చెలామణీ అవుతోందా? యాదగిరిగుట్టలో ఇటీవల జరిగిన ఐటీ సోదాలపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థిక శాఖ. ఆరేళ్లుగా రూ. 700 కోట్లు లెక్కలు చూపలేదని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు ఐటీ విభాగం సేకరించినట్టు తెలిపింది. దీంతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఐటీ సోదాల్లో రూ. 11 కోట్ల 88 లక్షల నగదుతో పాటు… సుమారు రూ. 2 కోట్ల విలువచేసే బంగారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని యాదాద్రిని అభివృద్ధి చేస్తోంది. ఆలయ నిర్మాణం కూడా తుదిదశకు చేరింది. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో యాదగిరి గుట్ట చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వెంచర్లు కుప్పలు తెప్పలుగా వెలిశాయి. ఆ లావాదేవీల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. వాటిపై నిఘా పెట్టిన ఐటీ శాఖ.. పలు సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. లెక్కలు చూపని రూ. 700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగానే రూ. 11 కోట్ల 88 లక్షల నగదు… సుమారు 2 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశామని ఐటీ అధికారులు తెలిపారు. కీలకమైన డాక్యుమెంట్లు, నల్ల ధనానికి సంబంధించిన చేతిరాత పుస్తకాలను సీజ్ చేశారు. నగదు లావాదేవీలతో పలు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది.
Read Also… గుంటూరులో కలకలం రేపుతున్న డ్రగ్స్.. గ్రామాల్లో కూడా మత్తుపదార్ధాలు విక్రయిస్తున్న జాదూగాళ్ళు..