హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. 14 ఏళ్లకు పుట్టిన కొడుకు.. వైద్యుల నిర్లక్ష్యంతో అనంత లోకాలకు

|

Jan 27, 2021 | 4:53 PM

విధి ఆ దంపతులపై పగబట్టింది. లేక లేక పద్నాలుగు ఏళ్లకు పుట్టిన కుమారుడ్ని మృత్యువు లాగేసుకుపోయింది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది.

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. 14 ఏళ్లకు పుట్టిన కొడుకు.. వైద్యుల నిర్లక్ష్యంతో అనంత లోకాలకు
Family-Death
Follow us on

విధి ఆ దంపతులపై పగబట్టింది. లేక లేక పద్నాలుగు ఏళ్లకు పుట్టిన కుమారుడ్ని మృత్యువు లాగేసుకుపోయింది. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో విషాదం చోటు చేసుకుంది. ఓ కంటి ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి 14 ఏళ్ల బాలుడు తనువు చాలించాడు. ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్‌ ఇవ్వడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు.

కంటి పరీక్షల నిమిత్తం పేరెంట్స్ ఆ బాలుడిని మంగళవారం(జనవరి 26) ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెడికల్ టెస్టులు సందర్భంగా డాక్టర్లు పొరపాటున ఒక ఇంజక్షన్‌కు బదులు మరో ఇంజక్షన్‌ను బాలుడికి ఇచ్చారు. దాని రియాక్షన్‌తో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కన్నుమూశాడు. వివాహమైన 14 ఏళ్లకు లేక లేక పుట్టిన కుమారుడు ఇలా డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా మారింది. కుమారుడిని విగతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తమకు బిడ్డ కావాలంటూ బోరున విలపించారు.

Also Read:

MLA Anam: అధికారులపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం.. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపణ

ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్