Hyderabad: మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని దారుణం.. భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుర్మార్గుడు..

|

May 10, 2022 | 8:51 AM

అనితా బాయి ఉస్మానియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ లేబర్‌ స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా.. భర్త రాజు.. భార్య సంపాదన పైనే ఆధారపడి నిత్యం మద్యం కోసం డబ్బులివ్వమని వేధిస్తుండేవాడు.

Hyderabad: మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని దారుణం.. భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుర్మార్గుడు..
representative image
Follow us on

Husband poured petrol on his wife: మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని.. ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యను పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ (Hyderabad) మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మైలార్‌దేవుపల్లి (mailardevpally) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీగూడ రాజీవ్‌ గృహకల్పలో నివసించే మాస రాజు (56), అనితా బాయి (52) దంపతులు. ఇటీవల కుమారుడు బాలుచందర్‌కి పెళ్లి చేశారు. అనితా బాయి ఉస్మానియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ లేబర్‌ స్వీపర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా.. భర్త రాజు.. భార్య సంపాదన పైనే ఆధారపడి నిత్యం మద్యం కోసం డబ్బులివ్వమని వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో ఈనెల 8న మధ్యాహ్నం పెట్రోల్‌ డబ్బాతో ఇంటికొచ్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలంటూ భార్యతో గొడవపడ్డాడు.

అయితే.. ఎంత గొడవ పడినా.. ఆమె ఇవ్వకపోవడంతో రాజు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై చల్లి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న కుమారుడు తల్లిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించాడు. ఈ క్రమంలో అనితా బాయి చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవుపల్లి పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

Andhra Pradesh: కాపు కాసి బండరాళ్లతో కొట్టి చంపారు.. బాలింతపై దుండగుల అమానుషం

Telangana: బస్సు-బొలెరో ఢీ.. చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం