బీఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కేసు: రవిశేఖర్‌పై రివార్డ్

| Edited By:

Jul 29, 2019 | 7:20 AM

కిడ్నాపర్ రవిశేఖర్ ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయల పారితోషికాన్ని ఇస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఉద్యోగం ఇప్పిస్తానని మాటలు చెప్పి.. ఈ నెల 23న ఓ యువతి, ఆమె తండ్రి, సోదరుడుని రవిశేఖర్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ తరువాత మార్గమధ్యంలో తండ్రి, సోదరుడిని దింపేసి ఆ యువతిని తీసుకెళ్లాడు నిందితుడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు మేరకు యువతి ఆచూకీ కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. రవిశేఖర్ కోసం విజయవాడ, బెంగళూరు […]

బీఫార్మసీ స్టూడెంట్ కిడ్నాప్ కేసు: రవిశేఖర్‌పై రివార్డ్
Follow us on

కిడ్నాపర్ రవిశేఖర్ ఆచూకీ తెలిపిన వారికి లక్షరూపాయల పారితోషికాన్ని ఇస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఉద్యోగం ఇప్పిస్తానని మాటలు చెప్పి.. ఈ నెల 23న ఓ యువతి, ఆమె తండ్రి, సోదరుడుని రవిశేఖర్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ తరువాత మార్గమధ్యంలో తండ్రి, సోదరుడిని దింపేసి ఆ యువతిని తీసుకెళ్లాడు నిందితుడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు మేరకు యువతి ఆచూకీ కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. రవిశేఖర్ కోసం విజయవాడ, బెంగళూరు నగరాలతో పాటు జాతీయ రహదారులపైనా గాలిస్తున్నారు. మరోవైపు ఆరు రోజులుగా తమ కుమార్తె జాడ తెలీకపోవడంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.