బోరబొండలో ఓ ఇళ్లు.. ఆ ఇంట్లో ఓ ట్రంకు పెట్టె.. అందులో అస్థిపంజరం.. అసలు మిస్టరీ విడిపోయింది..

|

Feb 11, 2021 | 10:13 PM

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్ర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అస్థిపంజరం కలకలం రేపింది. ఇనుపెట్టలో బయటపడిన అస్థిపంజరం పూర్తిగా పాడైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు

బోరబొండలో ఓ ఇళ్లు.. ఆ ఇంట్లో ఓ ట్రంకు పెట్టె.. అందులో అస్థిపంజరం.. అసలు మిస్టరీ విడిపోయింది..
Follow us on

హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్ర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో అస్థిపంజరం కలకలం రేపింది. ఇనుపెట్టలో బయటపడిన అస్థిపంజరం పూర్తిగా పాడైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

హైదరాబాద్‌లో ఏడాది క్రితం జరిగిన ఓ మర్డర్‌ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని బోరబొండలో ఈ ఘటన కలకలం రేపింది. ఇందిరానగర్‌లోని సాయిబాబా గుడి.. టెంపుల్‌ సెల్లార్‌లో ఓ గదికి చాలా రోజులుగా ఇలా తాళం వేసి వుంది. 2017లో ఈ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాల్‌. వృత్తిరీత్యా ఇతను కార్పెంటర్‌. తన సామాగ్రిని భద్ర పరుచుకునేందుకు ఈ గదిని అద్దెకు తీసుకున్నాడు. అగ్రిమెంట్‌ కూడా జరిగింది. నెలనెలా రెంట్‌ కూడా ఇచ్చేవాడు. ఆ డబ్బుతోనే అర్చకులకు వేతనాలు ఇచ్చేవాళ్లు ఆలయ నిర్వాహాకులు.

అయితే, కరోనా లాక్‌డౌన్‌తో పాల్‌ యూపీకి వెళ్లాడు. ఫోన్‌లో టచ్‌లో ఉండేవాడు. అయితే 20 నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో నిర్వాహాకులకు డౌట్‌ వచ్చింది. గదిని మరెవరికైనా అద్దెకు ఇవ్వాలని, రూమ్‌లో సామాగ్రిని చెక్‌ చేస్తుండగా ఓ ట్రంకు పెట్టె కనిపించింది. దాన్ని ఓపెన్‌ చేసి చూడటంతో ఓ అస్థిపంజరం బయటపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆలయ నిర్వాహకులు. హత్య చేసి శవాన్ని ట్రంక్‌ పెట్టేలో పెట్టి వుంటారని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. ఐతే ఈలోపే కార్పెంటర్‌ పాల్‌ నుంచి ఆలయ ధర్మకర్త యాదయ్యకు ఫోన్‌ కాల్‌ రావడంతో దాని ఆధారంగా అతడు యూపీలో కాదు హైదరాబాద్‌లోనే ఉన్నాడని భావించిన పోలీసులు అతడిని పట్టుకున్నారు.

మరోవైపు అస్థిపంజరం మిస్టరీని చేధించారు పోలీసులు. హతుడిని కమల్‌మైత్రిగా గుర్తించారు. 2020 జనవరి 11 నుంచి తన భర్త కనిపించడం లేదని అతని భార్య పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read:

డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి

తెలంగాణలోని ఆ ప్రాంతంలో ఖర్జూర కల్లుకు విపరీతమైన డిమాండ్.. లీటరు రూ. 200పైనే.. ఆ గీత కార్మికుడి ఐడియా అదుర్స్