Husband kills Wife : ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లైన రెండు నెలలకే ఆమెకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. కోటి ఆశలతో కొత్త కాపురంలో అడుగుపెట్టిన యువతిని కట్టుకున్న భర్తే కాలయముడై కడతేర్చాడు. అంతేకాదు హత్య చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆపై ఏం తెలియనట్లు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో అతగాడి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన ఎర్రమల నవ్య రెడ్డిని సొంత బావ నాగ శేషురెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. గత ఏడాది డిసెంబర్‌లోనే పెద్దల సమక్షంలో ఘనంగా వీరిద్దరికి మ్యారేజ్ చేశారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నవ్య… కాలేజీకి వెళ్లాలని అడిగింది. తాను తీసుకెళ్తానని చెప్పిన భర్త నాగ శేషురెడ్డి.. ఆమెను హతమార్చాడు. ఏమీ ఎరగనట్టు సైలెంట్‌గా ఇంటికి వచ్చేశాడు.
ఇదిలావుంటే, నవ్య చెల్లి సెల్‌ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని చదవలేకపోతున్నానని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మెసేజ్ వచ్చింది. అప్పటి వరకు సరదాగా ఉన్న ఇంట్లో కలకలం రేగింది. దీంతో నవ్య కుటుంబసభ్యులు భర్త నాగశేషురెడ్డిని వాకబు చేశారు. అయితే, తానూ కాలేజీ వెళ్తానంటే.. కాలేజీకీ వెళ్లే దారిలో డ్రాప్ చేసి వచ్చానని మాత్రమే సమాధానం చెప్పాడు. ఆమె కనిపించడం లేదని… సెల్‌ఫోన్ స్విచాఫ్ ఉందని… భర్త నాగ శేషురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణ క్రమంలో ఓ సీసీటీవీ ఫుటేజ్ స్టోరీని మలుపు తిప్పింది. నాగశేషురెడ్డి అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు తమ స్టైల్‌లో ఎంక్వయిరీ చేశారు. దెబ్బకు భర్త నాగశేషురెడ్డి నిజాన్ని కక్కేశాడు.
బుధవారం రాత్రి నవ్యను బైక్‌పై తీసుకొచ్చి కుక్కలగుట్ట వద్ద హతమార్చినట్టు నేరం అంగీకరించాడు. ముందు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పిపడిపోయిన తర్వాత చున్నీతో ఉరి వేసి చంపేశానని ఒప్పుకున్నాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె సెల్‌ఫోన్ నుంచే నవ్య చెల్లికి మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ఏమి తెలియదన్నట్లు ఇంటికి చేరుకుని ఎప్పటిలాగే మిస్సింగ్ డ్రామా మొదలుపట్టాడు.
నాగశేషురెడ్డి అసలు స్వరూపం తెలిశాక బంధువులు, కుటుంబసభ్యులు షాక్‌కి గురయ్యారు. ఆయనకు లవ్ ఎఫైర్ ఉందని అందుకే ఈ హత్య చేసినట్టు చెబుతున్నారు. తరచూ మత్తు ఇచ్చే టాబ్లేట్లు కూడా వేస్తుంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేట్టారు. మృతదేహన్ని నిమిత్తం తరలించారు. భర్త నాగశేషురెడ్డిని అదుపులోకి తీసుకున్నామని హత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి… హైదరాబాద్ అమ్మాయికి అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ పత్రిక ‘30 అండర్ 30’ జాబితాలో కీర్తిరెడ్డికి స్థానం