పెళ్లైన ఏడాదికే భార్యను చంపిన భర్త

భార్యభర్తల మధ్య గొడవలు చివరకు భార్య ప్రాణాలు కోల్పోయేంత వరకు వెళ్లింది. క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యనే రోకలి బండతో కొట్టి హతమార్చాడు ఓ భర్త. వరంగల్ రూరల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

పెళ్లైన ఏడాదికే భార్యను చంపిన భర్త

Updated on: Aug 10, 2020 | 2:42 PM

భార్యభర్తల మధ్య గొడవలు చివరకు భార్య ప్రాణాలు కోల్పోయేంత వరకు వెళ్లింది. క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ కలహాలతో తాళి కట్టిన భార్యనే రోకలి బండతో కొట్టి హతమార్చాడు ఓ భర్త. వరంగల్ రూరల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నెక్కొండ మండల కేంద్రానికి చెందిన చొప్పరి అశోక్, అక్షర దంపతులు నివాసముంటున్నారు. జీవనోపాధి కోసం కిరణం షాపులో పని చేస్తున్నారు. అశోక్, అక్షర భార్యభర్తలకు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అయితే, వారికి సంతానం లేకపోవడం కలహానికి దారితీసింది. దీంతో వీరి కాపురంలో తరచుగా గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో సోమవారం అశోక్ అక్షర తలపై రోకలి బండతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అక్షర (25) ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్షర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Follow Us