Murder Mystery: సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. నిందితుడిని పట్టించిన వాషింగ్ మిషన్!

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ఇంట్లో ఓ బ్యూరోక్రాట్‌ని నిరుద్యోగి అయిన ఆమె భర్త హతమార్చాడు. ఆ వ్యక్తి సాక్ష్యాలను దాచిపెట్టి, మరణించిన తీరు గురించి పోలీసులకు అబద్ధాలు చెప్పి అందరి దృష్టి మరల్చడానికి ప్రయత్నించాడు. చివరికి వాషింగ్ మిషన్ ఇతగాడి అసలు బండారం బయటపెట్టింది.

Murder Mystery: సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మృతి కేసులో వీడిన మిస్టరీ.. నిందితుడిని పట్టించిన వాషింగ్ మిషన్!
Sdm Nisha Napit

Updated on: Jan 30, 2024 | 7:29 AM

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ఇంట్లో ఓ బ్యూరోక్రాట్‌ని నిరుద్యోగి అయిన ఆమె భర్త హతమార్చాడు. ఆ వ్యక్తి సాక్ష్యాలను దాచిపెట్టి, మరణించిన తీరు గురించి పోలీసులకు అబద్ధాలు చెప్పి అందరి దృష్టి మరల్చడానికి ప్రయత్నించాడు. చివరికి వాషింగ్ మిషన్ ఇతగాడి అసలు బండారం బయటపెట్టింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దిండోరి జిల్లాలో సబ్ డివిజనల్ ఆఫీసర్ రెవెన్యూ (ఎస్‌డీఎం) అధికారిణి నిషా నపిత్ మృతిలో కేసులో సంచలన వెలుగులోకి వచ్చింది. నిషా అనారోగ్యంతోనో, గుండెపోటుతోనో చనిపోలేదని పోలీసులు తేల్చేశారు. ఆమె భర్త మనీష్ శర్మ ఆమె ముఖాన్ని దిండుతో నొక్కి హత్య చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఆమె రక్తంతో తడిసిన బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసి, ఉతికి ఆధారాన్ని నాశనం చేశాడు. నిందితుడైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపిసి 302,304 బి, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మ్యాట్రిమోనియల్ సైట్‌లో కలుసుకున్న నిషా నపిట్, మనీష్ శర్మలు 2020లో వివాహం చేసుకున్నారు. నిషా నపిత్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రెవెన్యూ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనీష్ శర్మ నిరుద్యోగి. ఇద్దరి మధ్య కొంత కాలంగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే దిండోరి జిల్లా షాపురాలో నిషా నపిత్ జనవరి 28వ తేదీ మధ్యాహ్నం మరణించారు. ఆమె భర్త మనీష్ శర్మ మృతి చెందిన స్థితిలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. మనీష్ శర్మ గుండెపోటు కారణంగా మరణించారని అందరినీ నమ్మించాడు.

అయితే నిషా సోదరి మాత్రం హత్యపై అనుమానం వ్యక్తం చేసింది. నిషా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఊపిరాడక హతమార్చి చంపినట్లు వెల్లడైంది. దీని ఆధారంగా మనీష్‌ను పోలీసులు విచారించగా.. చిందులు తొక్కాడు. మనీష్ నిషాను దిండుతో ఊపిరాడకుండా చేసి, సాక్ష్యాలను దాచిపెట్టాడు. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతికి ఆరబెట్టి హత్య చేశాడు. వాషింగ్ మెషీన్‌లోని దిండు కవర్, బెడ్‌షీట్‌ను పోలీసులు కనుగొన్నారు. ఇది కేసును ఛేదించడంలో పెద్ద క్లూగా మారింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిషా గుండెపోటుతో చనిపోలేదని, హత్య చేసిన ఆధారాలు లభించాయి. దీని ఆధారంగా పోలీసులు మనీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఇదిలావుంటే, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నిషా నపిత్ – దిండోరి జిల్లాలోని షాపురాలో విధులు నిర్వహిస్తున్నారు. తన సర్వీస్ బుక్, ఇన్సూరెన్స్, బ్యాంక్ ఖాతాలో తన పేరు నామినీ పెట్టకపోవడంతో మనీష్ శర్మ కలత చెందాడని పోలీసులు తెలిపారు. అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. కాగా, ఆసుపత్రిలో వైద్యులు ఆమెను పరీక్షించగా, ఆమె ముక్కు, నోటి నుండి రక్తస్రావం కనిపించింది. పోస్ట్‌మార్టం నివేదిక, సాక్షుల వాంగ్మూలం, నేరం జరిగిన ప్రదేశంలో విచారణ జరిపిన పోలీసులు వెంటనే శర్మను అరెస్టు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…