ట్యాంక్‌బండ్‌ దగ్గర హోంగార్డు ఆత్మహత్య.. పార్కింగ్‌ ఆటోలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ గుంటూరుకు చెందిన నాగరాజు

|

Jan 30, 2021 | 11:24 PM

హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరలోని ఎన్టీఆర్ మార్గ్ లో హోంగార్డ్ ఆత్మహత్య కలకలం రేపింది. ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్రదేశంలో..

ట్యాంక్‌బండ్‌ దగ్గర హోంగార్డు ఆత్మహత్య.. పార్కింగ్‌ ఆటోలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ గుంటూరుకు చెందిన నాగరాజు
Follow us on

హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరలోని ఎన్టీఆర్ మార్గ్ లో హోంగార్డ్ ఆత్మహత్య కలకలం రేపింది. ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్రదేశంలో హోంగార్డు ఆటోలో కూర్చుని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతుడు గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన నాగరాజు గుర్తించిన పోలీసులు.. మూడు నెలల ముందే సైఫాబాద్ ట్రాఫిక్ PS నుంచి గోషామహల్ హార్స్ రైడింగ్ కేంద్రానికి బదిలీపై వెళ్లినట్లు చెబుతున్నారు.

ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నా. కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

 

Sushant Cousin Shot : సుశాంత్​ సింగ్​ బంధువుపై గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు.. విచారణ జరుపుతున్న పోలీసులు