Threat Email to PM: ప్రధాని మోదీకి బెదిరింపు ఈమెయిల్ పంపిన ఐఐటీయన్.. ఎందుకు పంపించాడంటే..?

కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపు ఈమెయిల్ పంపిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ( ఏటీయస్ ) శనివారం..

Threat Email to PM: ప్రధాని మోదీకి బెదిరింపు ఈమెయిల్ పంపిన ఐఐటీయన్.. ఎందుకు పంపించాడంటే..?
Threatning Mail To Pm Modi
Follow us

|

Updated on: Nov 28, 2022 | 11:39 AM

కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపు ఈమెయిల్ పంపిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన 25 ఏళ్ల వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ( ఏటీయస్ ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బదౌన్‌లోని ఆదర్శనగర్ నివాసి అమన్ సక్సేనా సోమవారం జామ్‌నగర్‌లో జరిగిన ర్యాలీలో మోదీకి ప్రాణహాని ఉందని బెదిరిస్తూ ఒక మెయిల్‌ను పంపాడు. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ మెయిల్ పంపించానని సక్సేనా అన్నాడు. సక్సేనా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( IIT ) బొంబాయి నుంచి  బీటెక్ పట్టా పొందిన వ్యక్తి.

‘‘ప్రధాని కార్యాలయానికి వచ్చిన బెదిరింపు ఈమెయిల్‌కు సంబంధించిన దర్యాప్తు బాధ్యతను హోం మంత్రిత్వ శాఖ గుజరాత్ ఎటీయస్‌కు అప్పగించింది. దాంతో ఏటీయస్ విచారణ ప్రారంభించింది. బదౌన్‌లోని ఆదర్శనగర్‌ నుంచి ఈ మెయిల్ వచ్చిందని మా సంస్థ గుర్తించింది’’ అని ఏటీయస్ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా  ఇద్దరు పోలీసులు బదౌన్‌కు వెళ్లి సాంకేతిక, మానవ నిఘాను చేపట్టారు. ఆ క్రమంలోనే సక్సేనాను గుర్తించి, అతన్ని తన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారని ఆ అధికారి చెప్పారు. తదుపరి విచారణ కోసం సక్సేనాను బదౌన్‌లోని పోలీసు లైన్లకు తీసుకెళ్లారు.

“ఏటీఎస్‌ని క్షుణ్ణంగా జరిపిన విచారణలో.. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉండే వ్యక్తి పేరు మీద సక్సేనా ఈ మెయిల్‌ను పంపినట్లు అతను తెలిపాడు. ఆ వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించాలని సక్సేనా భావించాడు. అయితే, . సాధ్యమయ్యే అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసాము’’ఆ సీనియర్ అధికారి తెలిపారు. ఐటీ చట్టంలోని ఇతర ఆరోపణలతో పాటు అనామక కమ్యూనికేషన్ ద్వారా బెదిరింపులు పంపినందుకు సక్సేనాపై ఏజెన్సీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రాథమిక దర్యాప్తులో సక్సేనా మాత్రమే ఆ ఈమెయిల్‌ను పంపినట్లు తెలుస్తున్నదని, అయితే విచారణలో ఇంకెవరిదైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే, అతన్ని లేదా ఆమెను కూడా విచారిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు