Crime News: దారుణం.. బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అఘాయిత్యం.. తాత, మామ కూడా..

Girl Raped By Father, Brother: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. తాజాగా.. వావి వరుసలు మరిచి సొంత తండ్రి, అన్న ఆమెపై అఘాయిత్యానికి

Crime News: దారుణం.. బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అఘాయిత్యం.. తాత, మామ కూడా..
Girl Harassment
Follow us

|

Updated on: Mar 20, 2022 | 11:05 AM

Girl Raped By Father, Brother: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. తాజాగా.. వావి వరుసలు మరిచి సొంత తండ్రి, అన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఐదేళ్లుగా ఆమెపై కర్కశంగా వ్యవహరిస్తూ.. ఆమెను చెరబడుతున్నారు. దీంతోపాటు తాత, మామయ్య కూడా ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర (maharashtra) లోని పూణెలో చోటుచేసుకుంది. పూణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలిక (11) కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి పూణెలో నివాసం ఉంటోంది. అయితే.. బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ క్రమంలో తన తండ్రి, అన్న, తాత, మామ తనపై చేసిన అఘాయిత్యం గురించి బాలిక చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

బాలిక చదువుతున్న పాఠశాలలో ఇటీవల ‘గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్’ (good touch and bad touch) కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో బాలికలకు అవగాహన కల్పిస్తుండగా బాధిత బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఉపాధ్యాయులకు చెప్పింది. 2017 నుంచి తన తండ్రే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని.. 2020లో సోదరుడు కూడా నీచానికి దిగజారినట్లు వెల్లడించింది. అంతేకాదు, తాత, మామయ్య కూడా లైంగిక వేధింపులకు గురిచేశారని కన్నీంటిపర్యంతమైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే.. నేరస్థులంతా వేర్వేరు సమయాల్లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఆమె కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయని పోలీస్ ఇన్‌స్పెక్టర్ (క్రైమ్) అశ్విని సత్పుటే చెప్పారు. 2017లో బీహార్‌లో నివసిస్తున్నప్పుడు తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక చెప్పిందన్నారు. ఇది సామూహిక అత్యాచారం కాదని తెలిపారు. నిందితులపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:

Telangana: యువతిని వెంటాడిన పాము.. ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. అసలేమైందంటే..?

AP Crime News: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం..

Chicken: భార్య చికెన్ వండలేదని డయల్ 100కు ఫోన్.. పోలీసులు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే..