Tamil Nadu Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్, ప్రభుత్వ బస్సు ఢీకొన్న సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం వేళ దిండిగల్ జిల్లాలోని.. బట్లగుండు-దిండిగల్ రహదారిపై సేవుగంపట్టి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు మిల్లులో పనిచేస్తున్న 15 మంది కార్మికులతో వెళ్తున్న వ్యాన్.. దిండిగల్ నుండి థేనికి బయలుదేరిన బస్సు రెండు ఎదురెదురుగా డీకొన్నాయి.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాజాజీ ఆసుపత్రి మదురైకి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ఉన్న 54 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని.. వారిని ప్రథమ చికిత్స కోసం బట్లగుండు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: