Firing at Wrestling: రెజ్లింగ్ రింగులో కాల్పులు.. మృతుల్లో ఓ మహిళా రెజ్లర్.. ఇద్దరికి తీవ్రగాయాలు

హర్యానా రోహ్‌తక్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రెజ్లింగ్‌ శిక్షణా కేంద్రం వద్ద కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..మరో..

Firing at Wrestling: రెజ్లింగ్ రింగులో కాల్పులు.. మృతుల్లో ఓ మహిళా రెజ్లర్.. ఇద్దరికి తీవ్రగాయాలు
Haryana firing

Updated on: Feb 13, 2021 | 11:31 AM

Haryana firing: హర్యానా రోహ్‌తక్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రెజ్లింగ్‌ శిక్షణా కేంద్రం వద్ద కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పోలీసులు.

మృతుల్లో ఓ మహిళా రెజ్లర్‌, రెజ్లింగ్‌ కోచ్‌ కూడా ఉన్నారని ..అతని మూడేళ్ల కుమారునికి కూడా గాయాలైనట్లు వెల్లడించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కొందరు రెజ్లింగ్‌ కోచ్‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

“మేము పోలీసు బృందాలను ఏర్పాటు చేసాము, ఈ సంఘటన గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాము” అని ఆయన చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు పరిశోధకులు నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నారని రోహ్తక్ రేంజ్ ఐజి సందీప్ ఖిర్వార్ పిటిఐకి తెలిపారు. మృతుల్లో రెజ్లింగ్ కోచ్ కూడా ఉన్నారని రోహ్తక్ కు చెందిన మరో పోలీసు అధికారి తెలిపారు. రెజ్లింగ్ కోచ్లతో పాత కక్షలే ‘అఖారా’లో కాల్పులకు కారణమని పోలీసులు అంటున్నారు.