fire at firecracker factory: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కార్మికులంతా బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ భారీ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం, అగ్నిమాపక దళం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. 10 అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పేందుకు కష్టపడుతున్నాయి. కర్మాగారం యజమాని భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటన అనంతరం ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అంతేకాకుండా మరణించిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల పరిహారం ఇవ్వనున్నట్లు పీఎంఓ ప్రకటించింది.
#UPDATE: The death toll in the incident of fire at a firecracker factory in Virudhunagar, Tamil Nadu rises to 6. More details awaited.
— ANI (@ANI) February 12, 2021
Also Read: