BJP MLA’s son firing in air: ఉత్తరాది రాష్ట్రాల్లో పలు కార్యక్రమాల్లో గాల్లోకి కాల్పులు జరుపుతున్న సంఘటనలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సైతం గాల్లోకి కాల్పులు జరపగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాల్పుల ఘటనలో లోని నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ కుమారుడు నరేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లోనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గనోలీ గ్రామంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో అతను గాల్లోకి కాల్పులు జరిపాడని ఘజియాబాద్ ఎస్పీ అమిత్ పాథక్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారి అశోక్ కుమార్ నరేష్‌కు తుపాకీని అందించారు. దీంతో అతను తుపాకీతో గాలిలోకి కాల్పులు జరపాడన్నారు. అనంతరం అటవీ అధికారికి తుపాకీని అందించాడని వెల్లడించారు. కాగా.. ఈ ఉదంతంపై ఎమ్మెల్యే నంద కిషోర్ మాట్లాడారు. తానంటే గిట్టనివారెవరో తన కుమారునిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన కుమారుడు ఉపయోగించింది బొమ్మ తుపాకీ అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు అటవీ శాఖ అధికారికి కూడా నోటీసులు అందించినట్లు తెలిపారు.
Also Read: