Navreet Singh: బంధువులకు విందివ్వడానికి వచ్చి విగతజీవిగా మారిపోయాడు.. ఉద్యమ రూపంలో యువకుడి బలి..

|

Jan 28, 2021 | 5:57 AM

Navreet Singh: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన ట్రాక్టర్ల ర్యాలీలో అల్లర్లు జరిగి ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Navreet Singh: బంధువులకు విందివ్వడానికి వచ్చి విగతజీవిగా మారిపోయాడు.. ఉద్యమ రూపంలో యువకుడి బలి..
Follow us on

Navreet Singh: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చిన ట్రాక్టర్ల ర్యాలీలో అల్లర్లు జరిగి ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా అతడు ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ ప్రాంతానికి చెందిన నవ్రీత్‌ సింగ్‌‌గా గుర్తించారు.ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లిన నవ్రీత్‌ సింగ్‌‌ అక్కడే ఓ అమ్మాయిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. ఆ విషయం ఇంట్లో వాళ్లకి చెప్పి బంధువులకు విందు ఇచ్చేందుకు స్వదేశానికి వచ్చాడు. ఇంతలోనే ఉద్యమ రూపంలో బలై విగతజీవిగా మారిపోయాడు.

బంధువుల ప్రోద్బలంతో నవ్రీత్‌ కిసాన్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో దిల్లీ ఐటీవో క్రాసింగ్‌ వద్ద వేగంగా ట్రాక్టర్‌ నడిపి పోలీస్‌ బారికేడ్లను ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్‌ బోల్తా పడి నవ్రీత్‌ చిక్కుకుపోయాడు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే ప్రాణాలు విడిచాడు. అయితే పోలీసుల కాల్పుల్లో నవ్రీత్‌ చనిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఆందోళనలు చేస్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారని, అందులోని ఒక షెల్‌ నవ్రీత్‌ తలకు తగలడంతో అతడు డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడని తోటి రైతులు ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఐటీవో క్రాసింగ్‌ వద్ద జరిగిన ఘటనపై సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు సీసీ రికార్డుల్లో ఎటువంటి బుల్లెట్‌ శబ్దం వినిపించలేదని తెలిపారు. నవ్రీత్‌ అతివేగంతో ట్రాక్టర్‌ను నడపడం వల్ల బ్యాలెన్స్‌ తప్పి వాహనం బోల్తా పడిందని వివరించారు.

రైతుల ఆందోళనపై ఏం చేద్దాం ? మంత్రులు రాజ్ నాథ్, తోమర్ లతో హోం మంత్రి అమిత్ షా చర్చలు