అడవి పంది దాడిలో రైతుకు గాయాలు

|

Oct 19, 2020 | 5:08 PM

మహబూబాబాద్ జిల్లాలో అడవి జంతువులు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. పంటపొలాలు, జనవాసాల్లోకి వస్తున్న అడవి మృగాలు పంటలు నాశనం చేయటంతో పాటు ప్రజలపై దాడులు చేస్తున్నాయి.

అడవి పంది దాడిలో రైతుకు గాయాలు
Follow us on

మహబూబాబాద్ జిల్లాలో అడవి జంతువులు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. పంటపొలాలు, జనవాసాల్లోకి వస్తున్న అడవి మృగాలు పంటలు నాశనం చేయటంతో పాటు ప్రజలపై దాడులు చేస్తున్నాయి. మామిడిగూడెం గ్రామానికి చెందిన రైతుపై అడవి పంది దాడి చేసింది. తీవ్ర గాయాలతో రైతు చావు తప్పి బయటపడ్డాడు.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన జనగం సారయ్య అనే రైతు రోజూ మాదిరిగానే తన మొక్కజొన్న పంట చేను వద్దకు వెళ్లాడు. అక్కడే సంచరిస్తున్నా అడవి పంది సారయ్య పై ఆకస్మాత్తుగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అటవీ పంది దాడి చేసిన విషయాన్ని గమనించిన స్థానిక రైతులు సారయ్యను కాపాడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికీ అంబులెన్స్ సమయానికీ రాకపోవడంతో ట్రాక్టర్ లో గాయపడిన రైతును ఆసుపత్రికీ తరలించారు. కాగా, కొత్తగూడ, గంగారం మండలాల రైతులకు అడవి పందుల వెతలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి జంతువులను తమను, తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు.