జనాభా లెక్కలంటూ నానమ్మకు బురిడీ..11నెలల చిన్నారి కిడ్నాప్

|

Mar 09, 2020 | 11:52 AM

జయశంకర్‌ భూపాలపల్లి సింగంపల్లిలో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేపింది. జనాభా లెక్కల కోసం వచ్చామని చెప్పి..

జనాభా లెక్కలంటూ నానమ్మకు బురిడీ..11నెలల చిన్నారి కిడ్నాప్
Follow us on

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడాదిలోపు ఉన్న బాబును ఎత్తుకెళ్లారు. ఇంటి ముందు నానమ్మతో పాటు ఆడుకుంటున్న బాలుడి మిస్సింగ్ ఘటనతో ఒక్కసారిగా స్థానికులతో పాటుగా జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు.  వివరాల్లోకి వెళితే…
జయశంకర్‌ భూపాలపల్లిలో ఈ కిడ్నాప్ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సింగంపల్లిలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటికి వెళ్లారు. అక్కడ ఓ ముసలమ్మ చిన్నారిని ఆడిపిస్తుండగా అక్కడికి వెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆమెను పలకరించారు. జనాభా లెక్కల కోసం వచ్చామని, మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలంటే.. రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపించాలని అడిగారు. దీంతో ఆమె బాలుడిన్ని అక్కడే వదిలి..ఆధారాలు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది బాలుడి నానమ్మ. తిరిగి వచ్చి చూసేసరికి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు…బాలుడు కూడా కనిపించలేదు. దీంతో చుట్టుపక్కలంతా గాలించారు. ఎక్కడా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. జరిగినదంతా ఫిర్యాదులో పోలీసులకు వెల్లడించారు. కిడ్నాపైన చిన్నారి వయస్సు 11 నెలలు ఉంటుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు హరీష్‌ ఆచూకీ కోసం నాలుగు బృందాలుగా పోలీసుల గాలిస్తున్నారు.