Crime News : దారుణం.. మద్యం మత్తులో కన్నకొడుకుపైనే తల్లి పైశాచికం.. బ్లేడుతో…

|

Feb 16, 2021 | 12:00 PM

మద్యం మత్తులో ఓ మహిళ కిరాతకంగా ప్రవర్తించింది. కన్నబిడ్డపైనే పైశాచికం ప్రదర్శించింది. తన సొంత కొడుకు మీద బ్లేడుతో దాడి చేయడం కలకలం రేేపింది.

Crime News : దారుణం.. మద్యం మత్తులో కన్నకొడుకుపైనే తల్లి పైశాచికం.. బ్లేడుతో...
Follow us on

మద్యం మత్తులో ఓ మహిళ కిరాతకంగా ప్రవర్తించింది. కన్నబిడ్డపైనే పైశాచికం ప్రదర్శించింది. తన సొంత కొడుకు మీద బ్లేడుతో దాడి చేయడం కలకలం రేేపింది. రంగారెడ్డి జిల్లా  గంధంగూడలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

కొడుకు తొడలపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసింది సదరు తల్లి. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు పరుగులు తీశారు. మద్యం మత్తులో ఉన్న తల్లిని అడ్డుకొని బాలుడ్ని రక్షించారు.  అప్పటికే బాలుడికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. తల్లి మద్యం మత్తులో ఉండి ఈ దాడి చేసినట్లుగా చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఈ విషయం తెలుసుకున్న రార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు తెలుసుకున్న అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

నిమ్మర‌సంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..

52 యేళ్ల సినీ ప్రస్థానం.. అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ బిగ్ బీ ఎమోషనల్