కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తులు రాంగ్ రూట్‌లో వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తికి తలకు బలమైన గాయంతో కోమాలోకి వెళ్ళాడు. మరొక వ్యక్తి ఎముకలు విరిగి ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుగా గుర్తించారు పోలీసులు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలోని ఓ పబ్బులో పార్టీ చేసుకుని జీడిమెట్లకు తిరిగి వెళ్తున్నారు ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజు రెడ్డి అతని స్నేహితులు. కేబీహచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోరం సర్కిల్ వద్దకు రాగానే రాంగ్ రూట్లో వచ్చిన హోండా సిటీ కారు అటువైపుగా వెళుతున్నటువంటి టూ వీలర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ సమయంలో డ్రైవ్ చేసిన వ్యక్తి మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజు రెడ్డిగా గుర్తించారు పోలీసులు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన అడ్రస్ రెడ్డి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుని తిరిగి రాంగ్ రూట్ లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అగ్రస్ రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 90 శాతం ఆల్కహాలిక్ పర్సంటేజ్ వచ్చిందన్నారు. గాయపడిన వ్యక్తులను రాజస్థాన్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. అగ్రజు రెడ్డి పై ఐపీసీ 185 ఏ 337 119 177 ఎంబి ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు…
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో చూడండి…
రాజస్థాన్ కు చెందిన కార్మికులు కుటుంబ సభ్యులతో సినిమా చూసి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. ఈ ఘటనలో దృవ్ చంద్ అనే వ్యక్తి తలకు బలమైన గాయాలయ్యాయి. మరో వ్యక్తి భన్వరీ లాల్‌కు తొంటి ఎముకలు విరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని స్థానికుల సాయంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…