గుంటూరులో కలకలం రేపుతున్న డ్రగ్స్.. గ్రామాల్లో కూడా మత్తుపదార్ధాలు విక్రయిస్తున్న జాదూగాళ్ళు..

|

Mar 31, 2021 | 9:34 PM

డ్రగ్స్‌ విక్రయాలు, సరఫరా ఇప్పటి వరకు కాస్మోపాలిటన్‌ నగరాలకే పరిమితమయ్యేది.. హైదరాబాద్‌, ముంబై, బెంగళూర్‌ లాంటి నగరాల్లోనే కనిపించేది.

గుంటూరులో కలకలం రేపుతున్న డ్రగ్స్.. గ్రామాల్లో కూడా మత్తుపదార్ధాలు విక్రయిస్తున్న జాదూగాళ్ళు..
Drugs
Follow us on

డ్రగ్స్‌ విక్రయాలు, సరఫరా ఇప్పటి వరకు కాస్మోపాలిటన్‌ నగరాలకే పరిమితమయ్యేది.. హైదరాబాద్‌, ముంబై, బెంగళూర్‌ లాంటి నగరాల్లోనే కనిపించేది. అయితే ఇప్పడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా డ్రగ్స్‌ విక్రయాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సింథటిక్ డ్రగ్స్ కలకలం సృష్టించాయి.

సింథటిక్ డ్రగ్స్ ను మిథాయిల్ ఎండియోక్సీ మితమ్ పింటమిన్ ను టాబ్లెట్ ల రూపంలో విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై వేల రూపాయల విలువ చేసే నాలుగు టాబ్లెట్స్, వంద గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. పెనుమాకలో దాడిచేసిన అధికారులు డ్రగ్స్ విక్రయిస్తున్న రామ మణికంఠ, దుర్గావలి లను అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన డ్రగ్ చాలా అరుదైనదని పోలీసులు తెలిపారు. కాస్మోపాలిటన్‌ నగరాల్లో మాత్రమే ఇప్పటి వరకు ఈ విధమైన డ్రగ్స్‌ కనిపించేదని, ఈ ఏరియాలో తొలిసారి ఈ డ్రగ్స్‌ పట్టుబడిందని తెలిపారు.

ఈ ప్రాంతంలో ఎక్కువగా గంజాయి మాత్రమే పట్టుబడుతుందన్నారు. అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన హరీష్‌తో పాటు వడ్డేశ్వరం దగ్గర బాయ్స్‌ హాస్టల్‌ నడుపుతున్న కందుల శ్రీకాంత్‌ అనే వ్యక్తుల దగ్గరి నుంచి ఈ డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఇద్దరికి డ్రగ్స్‌ విక్రయించిన వారికి డ్రగ్స్‌ని ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఎవరికి వీటిని విక్రయిస్తున్నారు? ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎంత కాలం నుంచి ఈ ఏరియాలో ఈ డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్నారు ? ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మంది ఉన్నారో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్‌ దందా వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పోలీసులకే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు… పోలీస్‌స్టేషన్‌ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

భర్త సంసారానికి పనికిరాడని తెలిసి కూడా పెళ్లి చేసుకుంది.. కానీ అతడు ఏంచేసాడంటే..