AP Crime News: విశాఖపట్నంలో డబుల్ మర్డర్ కలకలం.. భయాందోళనలో పట్టణ వాసులు

|

Apr 12, 2022 | 2:04 PM

ఏపీలోని విశాఖలో డబుల్ మర్డర్ కేసులు కలకలం రేపుతున్నాయి. డాబాగార్డెన్స్ ప్రాంతంలో సందీప్ హత్య జరిగిన గంటలోనే.. HB కాలనీలో ఇంటర్ విద్యార్థి గుణశేఖర్‌ను కొట్టి చంపారు దుండగులు.

AP Crime News: విశాఖపట్నంలో డబుల్ మర్డర్ కలకలం.. భయాందోళనలో పట్టణ వాసులు
Wife Murder
Follow us on

Double Murder In Visakhapatnam: ఏపీలోని విశాఖలో డబుల్ మర్డర్ కేసులు కలకలం రేపుతున్నాయి. డాబాగార్డెన్స్ ప్రాంతంలో సందీప్ హత్య జరిగిన గంటలోనే.. HB కాలనీలో ఇంటర్ విద్యార్థి గుణశేఖర్‌ను కొట్టి చంపారు దుండగులు. విశాఖపట్నం నగరంలో జరిగిన వరుస ఘటనలపై స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఘటనా స్థలంలో హత్యకు వినియోగించిన వస్తువులను క్లూస్ టీం సిబ్బంది సేకరించారు. హత్య జరిగిన స్థలంలో సిసి కెమెరాలు లేవని పోలీసులు చెప్పారు. గుణశేఖర్ హత్య గంజాయి బ్యాచ్ పనైవుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే.. ముగ్గురు ఘటనా స్థలంలో ఉన్నట్టు స్థానికులు చెప్పారని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసుకోని దర్యాప్తును ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

HB కాలనీ పరిసరాల్లో డ్రగ్స్‌కు బానిసైన కుర్రాళ్లు రాత్రిళ్లు తిరుగుతున్నట్టు స్థానికులు చెప్పారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్లే వాళ్లపై దాడులు చేసి వారి దగ్గరున్న డబ్బు, బంగారం లాక్కునే వాళ్లని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గుణశేఖర్‌ని కూడా వాళ్లే చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. కాగా.. ఈ ఘటనలు విశాఖపట్నంలో కలకలం సృష్టించాయి.

ఇవి కూడా చదవండి: Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..

Coronovirus: కరోనా నుంచి కోలుకున్నవారిలో సంతానోత్పత్తి ఉండదా?.. స్టన్నింగ్ రిపోర్ట్..