Criminal: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్ కిటికీ నుంచి దూకిన నేరస్థుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?

|

Apr 21, 2021 | 8:16 AM

criminal falls from bathroom window: ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కరుడుగట్టిన నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. నేరస్థులపై కఠిన చర్యలు

Criminal: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూమ్ కిటికీ నుంచి దూకిన నేరస్థుడు.. ఆ తర్వాత ఏమైందంటే..?
Uttar Pradesh Crime News
Follow us on

criminal falls from bathroom window: ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కరుడుగట్టిన నేరస్థులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ప్రభుత్వం ఇప్పటికే పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. పోలీసులు నేర‌స్థుల కోసం నిత్యం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటిపై రైడ్ చేయగా.. వారినుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ఓ క్రిమిన‌ల్‌ రెండో అంత‌స్థులో ఉన్న‌ బాత్రూమ్‌ కిటికీలో నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డి మృతిచెందాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో జ‌రిగింది. గ్రేటర్ నోయిడాలోని మ‌హ‌మ్మ‌ద్ ఇమ్రాన్ అనే నేర‌స్థుడి సహచరుల ఇంటిపై పోలీసులు దాడిచేశారు.

ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ ఇద్ద‌రు బంధువులు ల‌క్మాన్‌, చాంద్ మ‌హమ్మ‌ద్‌ పోలీసుల‌కు లొంగిపోయారు. వారిని ప్ర‌శ్నిస్తుండగా.. చాంద్ మ‌హ‌మ్మ‌ద్ బాత్రూమ్‌ అని చెప్పి వెళ్లాడు. అనంతరం చాంద్ పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకునేందు‌కు ప్రయ‌త్నించాడు. ఇందులో భాగంగా బాత్రూమ్‌ కిటికీలో నుంచి కిందికి దూకాడు. రెండో అంత‌స్థు నుంచి దూకడంతో చాంద్‌కు తీవ్రంగా గాయాల‌య్యాయి.

దీంతో పోలీసులు ఆ నేరస్థుడిని వెంటనే ఆసుపత్రికి త‌ర‌లించారు. ఈ క్రమంలో చాంద్ చికిత్స పొందుతూ మరణించాడని గ్రేట‌ర్‌ నోయిడా డీసీపీ రా‌జేష్ కుమార్ సింగ్ మంగళవారం తెలిపారు. చాంద్‌పై పదికి పైగా దొమ్మి, హ‌త్య కేసులు ఉన్నాయ‌ని పోలీసులు వెల్లడించారు. ఇన్‌స్పెక్ట‌ర్ అక్త‌ర్ ఖాన్ హ‌త్య కేసులో చాంద్ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నాడని వెల్ల‌డించారు.

 

Also Read:

Couple Suide: కూతురు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు.. ఇంతలోనే తల్లిదండ్రులకు షాక్.. బలవన్మరణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ దంపతులు