Couple Murder: నల్లగొండ జిల్లాలో దారుణం.. ఆరు బయట నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య.. కారణం అదేనా?

|

Apr 19, 2021 | 8:38 AM

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి దంపతులు నిద్రిస్తున్న సమయంలో అతికిరాతకంగా నరికి హతమార్చారు దుండగులు.

Couple Murder: నల్లగొండ జిల్లాలో దారుణం.. ఆరు బయట నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య.. కారణం అదేనా?
murder
Follow us on

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి దంపతులు నిద్రిస్తున్న సమయంలో అతికిరాతకంగా నరికి హతమార్చారు దుండగులు. నేరుడుగొమ్ము మండ‌లంలో ఈ దారుణం జ‌రిగింది. అర్ధరాత్రి ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న దంపతుల‌ను గుర్తు తెలియని దాడి చేసి నరికి చంపారు. మండ‌లంలోని బుగ్గతండాకు చెందిన బుల్లి, నేనావ‌త్ సోమాని.. భార్యభ‌ర్తలు. ఆదివారం రాత్రి వారు త‌మ ఇంటి ఆరుబ‌య‌ట నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్యక్తులు వారిని హ‌త్య చేశారు.

తెల్లవారేసరికి రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుందని పోలీసులు తెలిపారు. కాగా, దంప‌తుల హ‌త్యకు భూవివాదాలే కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

Read Also… 

 Egypt train Accident: ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

Election king: ఆయ‌న ల‌క్ష్యం గెలుపు కాదు.. పోటీ చేయ‌డ‌మే.. ఓట‌మే ఆయ‌న‌ను రికార్డుల్లోకెక్కించింది..