తల్లిదండ్రుల పేదరికం, మోయలేని స్కూల్ ఫీజులు మరో స్టూడెంట్‌ని బలి తీసుకున్నాయి. హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో ఈ దారుణం జరిగింది. ఫీజు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యం వేధించడంతో తట్టుకోలేక ఉరేసుకుంది పదో తరగతి చదువుతున్న బాలిక. ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు కూతుళ్లు. తండ్రి కూలి పని చేసుకుని ముగ్గుర్నీ చదివిస్తున్నాడు. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా వాళ్లకు పూట గవడని పరిస్థితి ఏర్పడింది. ఈ ఇబ్బందులతో ఫీజు టైంకు కట్టలేకపోయారు. స్కూల్‌లో ప్రతిరోజు ఫీజుల గురించి అడుగుతున్నారంటూ వాపోయిన విద్యార్థిని.. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
Read also : రెండాకులు..రెండు వర్గాలు : వ్యూహప్రతివ్యూహాలతో హీటెక్కిపోతోన్న తమిళ పాలిటిక్స్, పళని – శశికళ వార్ పీక్స్