రోడ్డు ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం

|

Jul 19, 2019 | 10:28 AM

పలు హిందీ సీరియల్స్‌లో నటించి బాల నటుడు మంచి పేరు తెచ్చుకున్న శివలేఖ్ సింగ్(14) ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అతని తల్లి లేఖన, తండ్రి శివేంద్ర సింగ్, నవీన్ సింగ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ధర్విసా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వారు బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కి వెళ్తున్నట్టు సమాచారం. ధర్విసా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. […]

రోడ్డు ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం
Follow us on

పలు హిందీ సీరియల్స్‌లో నటించి బాల నటుడు మంచి పేరు తెచ్చుకున్న శివలేఖ్ సింగ్(14) ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అతని తల్లి లేఖన, తండ్రి శివేంద్ర సింగ్, నవీన్ సింగ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ధర్విసా ప్రాంతానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో వారు బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్‌కి వెళ్తున్నట్టు సమాచారం.

ధర్విసా సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.  ప్రస్తుతం శివలేఖ్ సింగ్ తల్లి లేఖన ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా ఇంటర్వ్యూ కోసమే శివలేఖ్ సింగ్ రాయ్‌పూర్ వెళ్తున్నట్టు అతని బంధువు ధీరేంద్ర కుమార్ శర్మ తెలిపారు.శివలేఖ్ సింగ్ స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లా. అతని తల్లిదండ్రులు గత 10 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారు. ‘సంకట్‌మోచన్ హనుమాన్’ ‘ససురాల్ సిమర్ కా’ లాంటి పలు హిందీ సీరియల్స్‌ శివలేఖ్ నటించాడు.