కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ వ్యాపారి నుంచి బంగారు బిస్కెట్లను తెలివిగా కొట్టేశారు గుర్తు తెలియని దుండగలు . ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అందుతోన్న సమాచారం ప్రకారం… జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి ఒకరు కిలో బంగారు బిస్కెట్లను చెన్నైలో కొనుగోలు చేసి ఆభరణాల తయారీ కోసం జగ్గయ్యపేట తీసుకెళ్తున్నాడు. వేరే వాహనంలో నెల్లూరు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ వైపు వెళ్లే బస్సు ఎక్కారు. ఒంగోలు బస్టాండుకి రాగానే కొందరు వ్యక్తులు బస్సులోకి ఎక్కి తాము స్పెషల్ పార్టీ పోలీసులమని, చెక్ చేయాలని ఆయనను కిందకు దింపి బంగారు బిస్కెట్లతో వెళ్లిపోయారు. దీంతో షాక్‌కు గురైన వ్యాపారి ఒంగోలులోని వర్తక సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన సంఘం ప్రతినిధులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఏ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి బంగారం స్వాధీనం చేసుకోలేదని వారు ఎంక్వైరీ ద్వారా తెలుసుకున్నారు. కాగా ఈ విషయం ఒంగోలు గోల్డ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి ద్వారా తమకు తెలిసిందని డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. అసోసియేషన్ కంప్లైంట్ మేరకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.
Also Read :
నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్
మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !
ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి