Chasing Criminal: ముందు ఒక కారు వేగంగా వెళుతోంది.. వెనుక అరడజను పోలీసు జీపులు దానిని ఛేజ్ చేస్తున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా ఒక భారీ వాహనం వచ్చి ముందు ఉన్న కారును ఢికొట్టింది. దీంతో ఆ కారు పోలీసులకు చిక్కింది. అచ్చం సినిమా సీన్ లా ఉంది కానీ, ఇది నిజంగానే జరిగింది కాలిఫోర్నియాలో.
ఒక హత్యకు సంబంధించిన నిందితుడ్ని పట్టుకోవడానికి అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒక హత్యా నేరం నిందితుడు.. పోలీసులపై దాడి చేసి పికప్ ట్రక్ లో పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు నిందితుడిని వెంటాడుతున్న విష్యం తానూ విన్నాననీ, అందుకే తన పెద్ద రిగ్ ట్రక్ ను సరిగ్గా చేజింగ్ లో వస్తున్న నిందితుడి వాహనానికి అడ్డుగా నిలిపానని రిగ్ ట్రక్ డ్రైవర్ అహ్మద్ షాబాన్ చెప్పారు. ఒక వేళ నేను ఆ పని చేయకపోతే ఈ చేజింగ్ చాలా సేపు సాగేది. పోలీసులకు మరింత శ్రమ అయ్యేది అని ఆయన తెలిపారు.
ఇక ఈ నిందితుని కారులో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆమె ఆ హంతకుడిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కింది. కానీ, ఆమెకు అతను హంతకుడు అని తెలియదు. దీంతో పోలీసులు కొద్దిసేపు ఆ మహిళను కూడా ప్రశ్నించారు. చివరికి ఆమెకు అతను హంతకుడు అనే విషయం తెలియదని నిర్ధారించుకుని విడిచి పెట్టారు. అక్కడి నిబంధనల ప్రకారం ఈ చేజ్ ఏ హత్య కేసులో జరిగింది..నిందితుడు ఎవరు అనే విషయాలు చెప్పరు. అయితే, సోషల్ మీడియాలో ఈ చేజ్ ముగింపు దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
NEW: A witness just gave me this video of the crash at the end of the murder suspect pursuit in Pomona. I haven’t been able to talk directly to the big rig driver yet, but I yelled to him and asked if he blocked the truck on purpose and he shook his head “no”. @FOXLA pic.twitter.com/aAHsWNQJrr
— Bill Melugin (@BillFOXLA) April 7, 2021