మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న చందాకొచ్చర్ దంపతులు.. ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలని పీఎంఎల్ఏ కోర్టు స‌మ‌న్లు

|

Feb 04, 2021 | 3:20 PM

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్న చందాకొచ్చర్ దంపతులు.. ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలని పీఎంఎల్ఏ కోర్టు స‌మ‌న్లు
Follow us on

ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కుంభకోణం వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆమెను ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో పదవి నుంచి కూడా తప్పించింది. వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌కు రుణాలు మంజూరు చేయడంలో చందా కొచ్చర్ తన అధికారిక స్థానాన్ని దుర్వినియోగం చేశారని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు అభిప్రాయపడింది. అలాగే చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ వివిధ సంస్థల ద్వారా అక్రమంగా లావాదేవీలు జరిపాడని ధ్రువీకరించింది. గతంలో ఈ విషయంలో దీప‌క్ కొచ్చర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

చందాకొచ్చర్ సార‌థ్యంలోని బ్యాంక్ క‌మిటీ వీడియోకాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్స్ సంస్థకు 2009 సెప్టెంబ‌ర్ 8న మంజూరు చేసిన రూ.300 కోట్ల రుణంలో రూ.64 కోట్లు మ‌రుస‌టి రోజే నుపోవ‌ర్ రెన్యూవ‌బుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు వీడియో కాన్ బ‌దిలీ చేసింద‌ని అభియోగం. అయితే ఈ రుణాలను ఎన్‌పీలుగా మార్చడం వల్ల ఐసీఐసీఐ బ్యాంకుకు నష్టం వాటిల్లిందని ఈడీ తన ఫిర్యాదులో పేర్కొంది. 2012 ఏప్రిల్ 26 నాటికి మొత్తం నిధుల దుర్వినియోగం రూ.1,730 కోట్లుగా తేల్చింది. పీఎమ్ఎల్ఏ కింద నమోదు చేసిన కేసులు, ఫిర్యాదులు, స్టేట్‌మెంట్‌ల ద్వారా కొచార్స్, ధూత్ మరియు ఇతర నిందితులపై మనీలాండరింగ్ కోసం విచారణను కొనసాగించడానికి ఈడీ సమర్పించిన అంశాలు సరిపోతాయని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఫిబ్రవ‌రి 12వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో దేశం అభివృద్ధివైపు.. పెరిగిన ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ తయారీ..