తమిళనాడులో బీభత్సం సృష్టించిన సిమెంట్ లోడ్ లారీ.. అదుపు తప్పి ఇతర వాహనాలపై దూసుకెళ్లి..

|

Dec 13, 2020 | 8:53 AM

సిమెంట్ లోడ్‌తో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఇతర వాహనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.

తమిళనాడులో బీభత్సం సృష్టించిన సిమెంట్ లోడ్ లారీ.. అదుపు తప్పి ఇతర వాహనాలపై దూసుకెళ్లి..
Follow us on

సిమెంట్ లోడ్‌తో వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి ఇతర వాహనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ధర్మపురి, సేలం రహదారిపై తోప్పూర్ దగ్గర సిమెంట్ లోడ్‌తో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఓ భాీ కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ వెనుక వస్తున్న వాహనాలు ఒక్కసారిగా ఒక దాని కొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. కాగా మరో పదిమంది తీవ్రగాయల బారినపడ్డారు. ఘటనా స్థలంలో చాలా కార్లు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయ సహకారాలు అందించారు. గాయపడినవారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా , సినిమా షూటింగ్‌ను తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు చూపురులను గగుర్పాటుకు గురి చేశాయి. ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్‌ స్తంభించింది. ఇదిలా ఉంటే గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.