Bribery Case: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్.. హైదరాబాద్‌లో కలకలం..

CBI Arrests Customs Officials: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి

Bribery Case: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్.. హైదరాబాద్‌లో కలకలం..
Cbi

Updated on: Oct 26, 2021 | 9:26 PM

CBI Arrests Customs Officials: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్‌ అధికారులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంగళవారం వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన కస్టమ్స్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌, ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ పాల్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం వారిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ధర్మాసనం ఆదేశాలతో వారిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఓ వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత నిందితుడు షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే.. బెయిల్‌ రద్దు కాకుండా ఉండేందుకు ఇద్దరు అధికారులు.. నిందితుడిని లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు రూ.20వేలు అడిగారు. అనంతరం రూ.10 వేలకు డీల్ కుదుర్చుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంరం రూ.10వేలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు దాడిచేసి సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు.. ప్రతి రెండవ, నాలుగో సోమవారం కస్టమ్స్ కార్యాలయం ముందు హాజరు కావాలి. ఈ క్రమంలో బెయిల్ రద్దవకుండా ఉండేందుకు నిందితుడు.. అధికారులను సంప్రదించగా.. వారు లంచం డిమాండ్ చేశారు. సమాచారం అనంతరం రూ.10వేలు లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కార్యాలయం, నిందితుల నివాస ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

Also Read:

Crime News: వీడు మామూలోడు కాదు.. 37 కోట్ల బీమా డబ్బుల కోసం పాముతో వేరే వ్యక్తిని చంపాడు.. చివరకు

Crime News: చిన్నారులపై అఘాయిత్యం.. సిగిరేట్లు తాగాలంటూ చెట్టుకు కట్టేసి కొట్టారు..