Breaking: హైదరాబాద్‌లో కారు బీభత్సం..!

| Edited By:

Feb 23, 2020 | 10:02 AM

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్ నెం.3లో కారు బీభత్సం సృష్టించింది. అదపుతప్పి ఓ కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. వెంటనే మంటలు చెలరేగడంతో కారు పాక్షికంగా దగ్ధమైంది. ఆ సమయంలో టిఫెన్ సెంటర్‌లో కొంతమందే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Breaking: హైదరాబాద్‌లో కారు బీభత్సం..!
Follow us on

Hyderabad: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్ నెం.3లో కారు బీభత్సం సృష్టించింది. అదపుతప్పి ఓ కారు హోటల్‌లోకి దూసుకెళ్లింది. వెంటనే మంటలు చెలరేగడంతో కారు పాక్షికంగా దగ్ధమైంది. ఆ సమయంలో టిఫెన్ సెంటర్‌లో కొంతమందే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో కారు నడపడం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ బ్యాగ్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోగా.. ఘటన అనంతరం కారు వదిలి యువకులు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా గతంలోనూ ఇదే చోట చాలా ప్రమాదాలు జరిగాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలకు ఆ హోటల్‌ డేంజర్ స్పాట్‌గా మారింది.