పాక్‌ అమ్మాయితో ప్రేమ‌.. ఆమెను కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు ఇలా..

| Edited By:

Jun 02, 2020 | 7:25 PM

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతితో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. అది కూడా సోషల్ మీడియా వేదికగా.. అయితే సినిమాలో ట్విస్ట్‌లా అమ్మాయి తల్లిదండ్రులు ఆ యువతికి పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు.

పాక్‌ అమ్మాయితో ప్రేమ‌.. ఆమెను కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు ఇలా..
Follow us on

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతితో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువకుడు ప్రేమలో పడ్డాడు. అది కూడా సోషల్ మీడియా వేదికగా.. అయితే సినిమాలో ట్విస్ట్‌లా అమ్మాయి తల్లిదండ్రులు ఆ యువతికి పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ యువతి ప్రేమికుడు బంగ్లాదేశ్‌లో ఉండటంతో అక్కడి వెళ్లడమనేది అసాధ్యం. అది కూడా పాకిస్థాన్‌లోని కరాచీకి.. అయితే ఎలాగైనా తన ప్రియురాలిని చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ చేరాల్సిన చోటికి సరైన మార్గంలో వెళ్లకుండా.. అక్రమంగా వెళ్లి కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన కరాచీకి చెందిన యువతిని కలువాలనుకున్నాడు. సదరు అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి.. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా కలకత్తాలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి పంజాబ్‌ వరకు చేరుకున్నాడు. అయితే అక్కడ అనుమానంతో కన్పించడంతో.. బీఎస్ఎఫ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలో సదరు బంగ్లాదేశీ యువకుడు చెప్పిన మాటలు విని షాక్‌ తిన్నారు అక్కడి అధికారులు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో వాస్తవాలేంటనేది పూర్తిగా తెలియరావాల్సి ఉంది.