Brutal Murder : ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన.. పేషెంట్‌పై కత్తితో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..

|

Feb 17, 2021 | 10:00 AM

Brutal Murder : కృష్ణాజిల్లా ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పేషెంట్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

Brutal Murder : ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన.. పేషెంట్‌పై కత్తితో దాడి.. కారణాలు ఇలా ఉన్నాయి..
Murder
Follow us on

Brutal Murder : కృష్ణాజిల్లా ఉయ్యూరు ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పేషెంట్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లికి చెందిన మొగిలి ప్రభాకర్‌రావు కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు ఉయ్యూరులోని రోటరీ నేత్ర వైద్యశాల చేరారు. సోమవారం ఆయనకు శస్త్ర చికిత్స చేసి వార్డుకు తరలించారు.
అయితే అతడు వార్డులో విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య పార్వతి, తల్లి సామ్రాజ్యం మందులు తేవడానికి బయటకు వెళ్లారు.

ఇదే అనువైన సమయం అనుకొని ఓ వ్యక్తి ఆస్పత్రి వార్డులోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాకర్‌రావు శరీరంపై పలుచోట్ల కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేయగా వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రావును మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే హత్యకు పాతకక్షలే కారణమని, నిందితుడు కూడా హతుడి స్వగ్రామానికి చెందిన రమేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్  దిగువన చూడండి..