Brother, Sister death: మృత్యువు విడదీయని బంధం.. అక్క వెంటే తమ్ముడు

తల్లి తర్వాత అంతటి ప్రేమాభిమానాలు పంచేది ఒక్క సోదరి మాత్రమే. అలాంటి సోదరి మృతిని తట్టుకోలేక తమ్ముడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లి పేగుతో ముడిపడ్డ వారి...

Brother, Sister death: మృత్యువు విడదీయని బంధం.. అక్క వెంటే తమ్ముడు
Death

Updated on: Feb 10, 2022 | 7:00 AM

తల్లి తర్వాత అంతటి ప్రేమాభిమానాలు పంచేది ఒక్క సోదరి మాత్రమే. అలాంటి సోదరి మృతిని తట్టుకోలేక తమ్ముడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లి పేగుతో ముడిపడ్డ వారి పేగుబంధం మృత్యువులోనూ వీడలేదు. గంటల వ్యవధిలోనే అక్కా తమ్ముడు తనువు చాలించారు. వారి అంత్యక్రియలకు వచ్చిన బంధువులు మృతదేహాలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నవల్లి మండలంలోని బంజేరులో బట్టు రుక్కవ్వ(70), ఆమె సోదరుడు బట్టు వస్య(60) నివాసం ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో రుక్కవ్వ బుధవారం వేకువజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న తమ్ముడు వస్య తీవ్ర అస్వస్థతతో తుదిశ్వాస విడిచాడు. వారి మృతదేహాలకు స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read

Unemployment: దేశంలో ప్రాణాలు తీస్తున్న నిరుద్యోగం.. మూడేళ్లలో 9 వేల మంది ఆత్మహత్య..

One Digital Id India: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి పత్రాల ఇబ్బందులకు ఎండ్ కార్డ్.. అన్ని పత్రాలు ఒకే డిజిటల్ IDతో ..

Ashu Reddy: మైండ్ బ్లాక్ అందాలతో మాయ చేస్తున్న అషు లేటెస్ట్ పిక్స్