Looteri Bride: అనాథనని చెప్పి నమ్మించి పెళ్లికి ఒప్పించింది. తర్వాత డబ్బు, బంగారంతో పరార్..! మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్‌పూర్ నగరంలో చోటుచేసుకున్న ఈ నకిళీ పెళ్లి (fake wedding) ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటనలో చురుగ్గా వ్యవహరించిన న్యాయవాదులు కొద్ది క్షణాల్లోనే దొంగ పెళ్లికూతురు అత్తనని చెప్పుకున్న మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత నేరస్థురాలైన వధువు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే..
జబల్‌పూర్‌లోని ఒమాటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఎస్‌పిఎస్ బాఘెల్ తెలిపిన వివరాల ప్రకారం.. భంటలయ్య నివాసి అయిన రేణు అలియాస్ సంగీత అహిర్వార్ అనే యువతి సియోనికి చెందిన దశరథ్ సింగ్ రాజ్‌పుత్‌ను జిల్లా కోర్టులో ఉన్న ఆలయంలో వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. రేణు తన అత్త అర్చన అహిర్వార్‌తో కలిసి వరుడు దశరథ్‌తో కొంత డబ్బు, నగలు తదితరాలతో వివాహం జరిపించడానికి నిశ్చయించుకున్నారు. పెళ్లికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా.. తనకు కారులో కూర్చోవడానికి అసౌకర్యంగా ఉందని చెప్పి కారు దిగి, సమీపంలోనున్న ప్రియుడి బైక్ ఎక్కి పరారయ్యింది. వధువు పారిపోయిందని తెలియగానే.. వెంటనే తేరుకున్న న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ఉన్న రేణుతో వచ్చిన మహిళ(అత్త అర్చన అహిర్వార్)ను నిర్భంధించారు. పెళ్లి నాటకమాడిన రేణు మొత్తం 2.5 లక్షల విలువైన బంగారు నగలు, రూ.50 వేల రూపాయల నగదుతో పరారయ్యినట్టు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో ఒమాటి పోలీసులు సదరు మహిళను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
Also Read: