‘దిశ’ నిందితులపై ఎన్‌కౌంటర్ జరిగి ఇప్పటికి 11 రోజులు అవుతోంది. ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజే.. ఆ డెడ్‌బాడీలను కుటుంబానికి ఇచ్చేస్తారని అనుకున్నా అది కుదరలేదు. దీంతో వాటిని గాంధీ మార్చురీలో ఉంచారు. ఇప్పటికే ఆ డెడ్‌బాడీస్ చెడిపోకుండా ఉండేందుకు ఎంతో ఖరీదైన ఇంజెక్షన్స్ ఇచ్చి.. ఎంబాల్మింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుండా పోతోంది. బాడీలకు ఎంబాల్మింగ్ చేస్తే.. దాదాపు రెండు వారాల పాటు చెడిపోకుండా ఉంటాయి. కానీ.. రీ పోస్టుమార్టానికి అవకాశం ఉండదు. ఎంత శీతల ప్రదేశంలో ఉంచిన అవి వారానికే ఉంటాయి. సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండంతో.. తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది.
ఈ నెల 6వ తేదీన తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో దిశ నిందితులపై ఎన్‌కౌంటర్ జరిగింది. చాలా రోజులవడంతో.. మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. రోజులు గడుస్తుండటంతో బాడీల నుంచి దుర్వాసన వస్తోంది. ఇలా మరో రెండు రోజులు గడిస్తే.. బాడీలు ఎందుకీ పనికిరాకుండా పోతాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. ఈ డెడ్ బాడీలను ఢిల్లీ మార్చురీకి తరలించాలని ప్రభుత్వాన్ని కోరే ప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ తెలిపారు.