సీఎం రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ నేతపై కేసు..!

|

Oct 20, 2020 | 2:44 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హాజరైన రోడ్డుషోలో పాల్గొన్న అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది.

సీఎం రోడ్ షోలో పాల్గొన్న బీజేపీ నేతపై కేసు..!
Follow us on

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హాజరైన రోడ్డుషోలో పాల్గొన్న అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేపై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఖాళీ అయ్యిన స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండోర్ సన్వర్ తహసీల్ లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రోడ్ షోలో కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించిన బీజేపీ నాయకుడు దినేష్ భవసర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రోడ్ షోలో ఐదు వాహనాలకు అనుమతి ఉండగా, 25 వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ మాస్కులు ధరించలేదని, సామాజిక దూరం పాటించలేదని బీజేపీ నేత దినేష్ భవసర్ పై సన్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తులసీ సిలావత్ కు మద్ధతుగా సీఎం చౌహాన్ రోడ్ షో లో పాల్గొన్నారు.