వరంగల్ నగరంలో పిల్ల దొంగలు బరితెగిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, సామాన్యుల ఇళ్లను టార్గెట్ చేసి సైకిళ్ళు మాయం చేస్తున్నారు.. రోజుకో చోట సైకిళ్ళ దొంగతనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సైకిల్ దొంగతనంపై పోలీసులకు పిర్యాదు చేయడాన్ని బాధితులు చులకనగా భావిస్తుంటే.. ఇదే అదునుగా సైకిల్ చోరీలకు పాల్పడుతున్నారు.
ఈ బుడతలు మాములు పిల్లలు కాదు.. వీళ్ళను నమ్మి కాస్త ఏమరుపాటుగా ఉంటే ఇల్లు గుల్లే. ప్రశాంతంగా వుండే కాలనీలు, అపార్ట్‌మెంట్ వుండే ఏరియాల్లో ఇలా అమాయకంగా గస్తీ నిర్వహిస్తారు. సైకిళ్ళు వీరి కంట పడితే చాలు… వాటిని మాయం చేస్తారు.
ఈ బాల దొంగలు ఓరుగల్లు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. రోజుకో చోట సైకిళ్ళు మాయం అవుతుండడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితుల బాధలు బయటికి చెప్పుకునేలా లేదు. ఈ చోరీలకు పాల్పడేది అంతా 12ఏళ్ల లోపు పిల్లలే. పైగా సైకిల్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే అవమానకరంగా ఉంటుందనే భావన. దీంతో ఎవరూ బయటికి చెప్పుకోవడం లేదు. ఈ మధ్యే హన్మకొండ బస్టాండ్ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో, అడ్వకేట్స్ కాలనీ లోని అపార్ట్‌మెంట్‌లో పట్టపగలే సైకిళ్ళు అపహరించుకు పోయారు.. వరుసగా రెండు సార్లు వచ్చి దర్జాగా సైకిళ్ళు మాయం చేశారు.
సైకిల్ మాయమైన ప్రతిసారి సీసీ కెమెరా దృశ్యాలు చూసి నోరెళ్ల బెట్టడం తప్ప… ఏం చేసే పరిస్థితి లేదు…పిల్లల సైకిల్లే కాదు పెద్దవారు కూడా ఉదయాన్నే సైక్లింగ్ కోసం ఉపయోగించే సైకిళ్లను కూడా దొంగిలిస్తున్నారు.. దీంతో ఇప్పటికే సైకిళ్ళు చోరీలకు గురైన వారు ఆందోళన చెందుతున్నారు.. ఇలాంటి పిల్ల దొంగలను క్షమిస్తే పెద్దయ్యాక పెద్దపెద్డ నేరాలు, దొంగ తనాలకు పాల్పడే అవకాశం ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
ఇప్పటికే ఈ పిల్ల దొంగలు వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో పదుల సంఖ్యలో సైకిళ్ళు మాయం చేశారు.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అవమానకరంగా భావించడమే వీరికి వరంగా మారింది.. స్కూళ్ళు మూతపడడంతో జల్సాలకు అలవాటు పడ్డ పిల్లలే ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారని భావిస్తున్న పోలీసులు… ఈ బాల దొంగలపై నిఘా పెట్టారు.
Also Read: ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే
చిట్టి పాదాలతో తనయుడి తొలి అడుగులు.. భావోద్వేగానికి గురైన తండ్రి.. వైరల్ వీడియో