సాయం కోసం 112కు ఫోన్‌ చేసిన మహిళ..! ఆమెనే ట్రాప్‌ చేసిన పోలీస్‌..! చివరికి..

బెంగళూరులోని చన్నపట్నం తాలూకాలో పుట్టస్వామి అనే కానిస్టేబుల్‌పై అత్యాచారం, 12 లక్షల రూపాయల లంచం ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పుట్టస్వామిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన పోలీసులపై నమ్మకాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం ఈ కేసును DCRE స్టేషన్ దర్యాప్తు చేస్తోంది.

సాయం కోసం 112కు ఫోన్‌ చేసిన మహిళ..! ఆమెనే ట్రాప్‌ చేసిన పోలీస్‌..! చివరికి..
Puttaswamy

Updated on: Jul 20, 2025 | 1:44 PM

పోలీసులు అంటే ఒక నమ్మకం, ధైర్యం. కానీ ఓ కానిస్టేబుల్‌ మొత్తం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ తెచ్చాడు. ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ తన వద్దకు సమస్యతో వచ్చిన మహిళపై అత్యాచారం చేశాడని తీవ్రమైన ఆరోపణ వచ్చింది. బెంగళూరు దక్షిణ జిల్లాలోని చన్నపట్నం తాలూకాలో 112 వెహికల్‌ డ్రైవర్ పుట్టస్వామిపై అత్యాచారం ఆరోపణ వచ్చింది. బాధిత మహిళ ఈ విషయంలో ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు కానిస్టేబుల్ పుట్టస్వామిని సస్పెండ్ చేశారు. అసలేం జరిగిందంటే..

ఒకరోజు 112 కు కాల్ వచ్చింది.. ఎం కె దొడ్డి పోలీస్ స్టేషన్ కు ఒక మహిళ ఫోన్ చేసి, “మా గ్రామంలో గొడవ జరుగుతోంది. ఇక్కడికి రండి” అని చెప్పింది. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్న కానిస్టేబుల్ పుట్టస్వామి ఆమెతో సంబంధం పెట్టుకుని, ఆమె ఇంట్లో నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, తన నుంచి రూ.12 లక్షలు బలవంతంగా వసూలు చేశాడని మహిళ ఆరోపించింది. బాధితురాలి నుంచి డబ్బు తీసుకున్న కానిస్టేబుల్ పుట్టస్వామి క్రమంగా ఆమెను పట్టించుకోకుండా దూరం పెట్టడం మొదలుపెట్టాడు.

బంగారం తాకట్టు పెట్టిన డబ్బును ఆమె అడిగినప్పుడు అతను అహంకారంతో బదులిచ్చాడు. ఈ కారణంగా ఆమె ఇంట్లో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. చివరికి ఆ మహిళ ఎంకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు చేస్తుండగానే కానిస్టేబుల్ పుట్టస్వామి తన మొబైల్‌ను ఆఫ్ చేసి పరార్‌ అయ్యాడు. దీంతో ఎస్పీ శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్ పుట్టస్వామిని సస్పెండ్ చేశారు. అత్యాచారం కేసు దర్యాప్తును DCRE స్టేషన్‌కు బదిలీ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి