కామాంధుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

కామాంధుడి వేధింపులు భరించలేక మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాత్ రూం వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందిన పోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో […]

కామాంధుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

Updated on: May 23, 2020 | 8:34 PM

కామాంధుడి వేధింపులు భరించలేక మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది. బాత్ రూం వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసినందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లైంగిక వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు గేట్‌ తండాకు చెందిన పోలూరి రాజేశ్వరి అనే వివాహిత స్నానం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు అనే యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us