Thives hulchal: పరిగిలో రెచ్చిపోయిన దొంగలు.. బ్యాక్ టూ బ్యాక్ తొమ్మిది షాపుల్లో చోరీలు.. పోలీసులకు సవాల్

|

Feb 04, 2021 | 10:04 AM

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగల హల్‌చల్ చేశారు.  పట్టణంలోని తొమ్మిది (9) దుకాణాల్లో వరస చోరీలకు పాల్పడ్డారు. పరిగి గంజ్ రోడ్డు..

Thives hulchal: పరిగిలో రెచ్చిపోయిన దొంగలు.. బ్యాక్ టూ బ్యాక్ తొమ్మిది షాపుల్లో చోరీలు.. పోలీసులకు సవాల్
Follow us on

Thives hulchal:  వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో దొంగల హల్‌చల్ చేశారు.  పట్టణంలోని తొమ్మిది (9) దుకాణాల్లో వరస చోరీలకు పాల్పడ్డారు.
పరిగి గంజ్ రోడ్డు.. ఎస్‌బిహెచ్ బ్యాంకు ముందు ఐదు వరుస దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. బహర్‌పేట్ మెయిన్ రోడ్డులోని ఒక కిరాణం షాపు, అమర వీరుల చౌరస్తాలోని ఒక షాపులో దొంగతనాలు జరిగాయి. గంజిరోడ్డులోని అల్ మదీన జ్యువెలరీ షాపులో 20 కిలోల వెండి, 5 తులాల బంగారం దొంగిలించారు దుండగులు.

మరో రెండు దుకాణాల్లో కూడా దొంగతనం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. షట్టర్లు ఓపెన్ కాకపోవడంతో వదిలేశారు. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ ని కూడా రప్పించారు. గతంలో ఇలాంటి దొంతనాలు జరిగినా ఇప్పటివరకు పోలీసులు చేధించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

IRCTC offer: ఐఆర్‌సీటీసీ బంఫర్ ఆఫర్.. అదిరే క్యాష్‌బ్యాక్.. కొన్ని రోజులు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవి

Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?