Crime: చేసింది వెధవ పని.. పరువు పోతుందని పోలీసు స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం!

ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. పీఎస్‌లో పోలీసుల ఎదుటే కండువాతో ఉరివేసుకుని గాజుల ఆంజనేయులు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

Crime: చేసింది వెధవ పని.. పరువు పోతుందని పోలీసు స్టేషన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం!
Darsi Ps

Updated on: Mar 26, 2022 | 9:01 AM

Man Suicide Attempt in PS:  ప్రకాశం జిల్లా(Prakasam District) దర్శి పోలీస్ స్టేషన్‌(Police Station)లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. పీఎస్‌లో పోలీసుల ఎదుటే కండువాతో ఉరివేసుకుని గాజుల ఆంజనేయులు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే గమనించిన పోలీసులు ఆంజనేయులును మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆంజనేయులు పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

దర్శి మండలం దానం చింతల కు చెందిన గాజుల ఆంజనేయులు తనకు చెల్లెలు వరుసయ్యే పదిహేడేళ్ల బాలికను తీసుకుని పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. బాలికను, ఆంజనేయులును అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఆంజనేయులును విచారిస్తున్న క్రమంలో పోలీసులు కొడతారన్న భయంతో పీఎస్‌లో తన కండువాతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. గాజుల ఆంజనేయులుకు ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. భార్య వదిలేయడంతో తన బంధువులలోనే చెల్లెలు వరుసయ్యే బాలికను మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడు. గాజుల ఆంజనేయులు నరదిష్టి దోషాల పేరుతో పూజలు చేస్తుంటాడని చెబుతున్నారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…. Andhra Pradesh: గృహిణిలకు బంపర్ ఆఫర్.. ముత్యాలను హారాలుగా మార్చడమే పని.. సర్వం గోవిందా