అనంతపురం ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ సస్పెండ్

| Edited By:

Aug 25, 2020 | 11:38 AM

అనంతపురం జిల్లా ట్రెజరీ ఉద్యోగిపై వేటు పడింది. ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. కోట్ల విలువైన అవినీతి సొమ్మును దాచిపెట్టినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా..

అనంతపురం ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కుమార్ సస్పెండ్
Follow us on

అనంతపురం జిల్లా ట్రెజరీ ఉద్యోగిపై వేటు పడింది. ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. కోట్ల విలువైన అవినీతి సొమ్మును దాచిపెట్టినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా బంగారం, వెండి కీలక డాక్యుమెంట్లు దొరికాయి. ఇవన్నీ మనోజ్‌ కూడబెట్టిన అవినీతి సొమ్మని తేలడంతో అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

అనంతపురం జిల్లాలో ట్రెజరీలో పని చేస్తున్న మనోజ్‌ తన కారు డ్రైవర్‌ ఇంట్లో భారీగా బంగారం నగదు దాచి పెట్టాడు. ఎనిమిది పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి దొరికాయి. మొదట్లో ఇదేదో రాజుల కాలం నాటి ఖజానా అనుకున్నారు. కానీ అందులోనే 15.55 లక్షల నగదు, 27లక్షల రూపాయల విలువైన ప్రామిసరీ నోట్లు, రూ.49 లక్షల బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల దొరకడంతో తీగలాగారు.

దీనివెనుక ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌ కుమార్‌ ఉన్నట్లు తేలింది. దీంతో పాటు మనోజ్‌కు చెందిన ఆరు బైక్‌లు, మూడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బులెట్లు, లక్షల విలువైన మరో ద్విచక్రవాహనం, నాలుగు ట్రాక్టర్లు, రెండు అత్యాధునిక కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులపైనా అనంతపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మనోజ్‌కి చెందిన ఆస్తులు మరికొన్ని ఆతని తల్లి, డ్రైవర్ నాగలింగం పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. తన పదవిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో అతడిపై వేటు పడింది.

Read More:

బిగ్‌బాస్-4 ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ

పెరగనున్న మొబైల్ చార్జీల ధరలు!

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఉధృతి.. 2.38 కోట్లకి చేరిన కేసులు

డబ్బులు కావాలంటే కాల్ చేయండి.. ఏటీఎం ఇంటికే వచ్చేస్తుంది